BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 09 September 2026, 09:05 pm
Posted by : ANTHATI NARENDAR

విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
09 Sep, 2026 - 09:05 PM
11 వీక్షణలు

చిట్యాల: Obviously ఏపూరు హైస్కూల్, పేరేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థుల కోసం దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం హెల్త్ చెకప్ క్యాంపులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఏపూరు గ్రామ పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్ చేతుల మీదుగా సుమారు రూ.1.30 లక్షల విలువైన నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అలాగే పేరేపల్లి గ్రామ పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ రూపాని సోనియా, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జి. రజిత చేతుల మీదుగా ఉచిత నోట్‌బుక్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ జమంత కుమార్, డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి దివీస్ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని సర్పంచులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మోహన్‌రావు, అంజయ్య, పాండు, ఉపాధ్యాయులు, హెల్త్ సిబ్బంది, దివీస్ అధికారులు బి. గోపి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.