గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం
పన్నులు చెల్లించని వాహనాలు.. సెప్టెంబర్ 25లోగా విడిపించుకునే అవకాశం
గుంటూరు | Ntoday News
రవాణాశాఖ తనిఖీల్లో పన్నులు చెల్లించకుండా పట్టుబడిన 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గుంటూరు, తెనాలి రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో 33 చొప్పున మొత్తం 66 వాహనాలు ఉన్నట్లు వెల్లడించారు.
వాహన యజమానులు తమ వాహనాలను వేలం నుంచి మినహాయించుకోవాలంటే సెప్టెంబర్ 25లోగా బకాయి పన్నులతో పాటు అపరాధ రుసుములను చెల్లించి వాహనాలను విడిపించుకోవచ్చని అధికారులు సూచించారు.
ఇక నిర్ణీత గడువులోగా పన్నులు, అపరాధ రుసుములు చెల్లించని వాహనాలను సెప్టెంబర్ 26న మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు DTO కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించి విక్రయించనున్నట్లు తెలిపారు. వాహన యజమానులు గడువులోగా సంబంధిత రుసుములు చెల్లించి వాహనాలను విడిపించుకోవాలని అధికారులు సూచించారు.