నారాయణపేటలో ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్, ప్రైవేట్ వ్యక్తి
నారాయణపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి నిర్వహించి సబ్ రిజిస్ట్రార్, ఓ ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2 లగిశెట్టి వెంకట్ స్వామి రూ.90 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రూ.50 వేల లంచాన్ని ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేష్ ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ గుర్తించింది.
డాక్యుమెంట్ నంబర్ 4723/2026కు సంబంధించిన ఇంటి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంతో పాటు అధికారికంగా అనుకూలత చూపించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రూ.50 వేలు చెల్లించినప్పటికీ, మిగిలిన రూ.40 వేలు కూడా చెల్లించాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది.
ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ వెంకట్ స్వామి, ప్రైవేట్ వ్యక్తి నాగేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.