విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్
యలమంచిలి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన "స్వర్ణాంధ్ర @ 2047 విజన్" నియోజకవర్గ స్థాయి శిక్షణా కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యమైన "స్వర్ణాంధ్ర @ 2047 విజన్" లో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయా కృష్ణన్, I.A.S. ఆదేశాల మేరకు సోమవారం యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో (CVAP Unit / MPDO కార్యాలయ ప్రాంగణంలో) నియోజకవర్గ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో యలమంచిలి నియోజకవర్గ ప్రత్యేక అధికారి వారి అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణా సదస్సులో మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, మరియు CVAP యూనిట్, యంగ్ ప్రొఫెషనల్ పాల్గొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రూ. 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా బలోపేతం చేయడం మరియు రూ. 55 lakhs తలసరి ఆదాయాన్ని సాధించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు:
ఆర్థిక సూచీలు-అవగాహన: నియోజకవర్గ, మండల పరిధిలోని అధికారులకు స్థానిక ఆర్థిక వృద్ధి కారకాలు, GSDP, GDDP, GVA అంచనాలపై సమగ్రమైన అవగాహన కల్పించారు.
స్థానిక సవాళ్ల గుర్తింపు: యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న వనరులు, అభివృద్ధి అవకాశాలు మరియు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వివిధ రంగాల సవాళ్లను గుర్తించి వాటి పరిష్కారాలపై సుదీర్ఘంగా చర్చించారు.
విజన్ యాక్షన్ ప్లాన్: రాబోయే రోజుల్లో నియోజకవర్గ వృద్ధిని వేగవంతం చేసేందుకు రూపొందించిన 'నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్' (Constituency Vision Action Plan) అమలు తీరును బలోపేతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.