BREAKING
నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!!
Date of Publish : 07 September 2026, 05:16 am
Posted by : JULI SRINIVASULU

నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
07 Sep, 2026 - 05:16 AM
0 వీక్షణలు

శ్రీ దాశరథి కృష్ణమాచార్య జాతీయ పురస్కారం అందుకున్న యువ నాటక రచయిత

నెల్లూరు జిల్లా | Ntoday News

సాంఘిక నాటక రంగంలో విశేషంగా రచనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని కళాకారుల మన్ననలు పొందుతున్న యువ నాటక రచయిత టీ. తాతారావు యాదవ్కు అరుదైన గౌరవం దక్కింది. నెల్లూరు జిల్లాలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శ్రీ దాశరథి కృష్ణమాచార్య జాతీయ పురస్కారం అందజేశారు.

సాంఘిక అంశాలను ప్రతిబింబించే పలు నాటకాలను రచిస్తూ నాటక రంగానికి సేవలందిస్తున్న తాతారావు యాదవ్‌ ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

జాతీయ పురస్కారం అందుకున్న తాతారావు యాదవ్‌ను పలువురు కళాకారులు, నాటక రంగ ప్రముఖులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ నాటకాలను రచించి తెలుగు నాటక రంగానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.