BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 04:21 pm
Posted by : GOUTHAM RUDRARAPU

పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
05 Sep, 2026 - 04:21 PM
8 వీక్షణలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన

పటాన్‌చెరు | Ntoday News

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పటాన్‌చెరు పోలీసులు జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను పోలీసులు సన్మానించారు.

ఎస్‌హెచ్‌ఓ ఎం. రవీందర్, ఎస్‌ఐ ఎం. మహేశ్వర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు మహిళలు, బాలల భద్రతకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు వివరించారు.

సోషల్ మీడియాను వినియోగించే సమయంలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు వంటి సమాచారాన్ని పంచుకోవద్దని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.