BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 05:14 pm
Posted by : DAVU RAVINDER REDDY

అదనపు కట్నం కోసం వేధింపులు..

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
05 Sep, 2026 - 05:14 PM
7 వీక్షణలు

అదనపు కట్నం కోసం వేధింపులు.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

మేడిపల్లిలో ఘటన.. పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్ | Ntoday News

అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త.. చివరకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట బాలాజీనగర్‌ టౌన్‌షిప్‌కు చెందిన అనిత (21)కు లాలుతో 2023లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. భర్త వేధింపులు భరించలేక అనిత నెల రోజుల క్రితం చెంగిచర్లలోని తన పుట్టింటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 2న లాలు కుమార్తెను తన వెంట తీసుకెళ్లాడు. మరుసటి రోజు కుమార్తె ఆచూకీ గురించి అనిత ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో లాలు అనితపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి.

ఘటనకు సంబంధించి మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధితురాలి పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.