కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్
/
వైఎస్ఆర్ కడప
10 మంది ప్రధానోపాధ్యాయులు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 30 మంది ఎస్‌జీటీలు ఎంపిక
కడప | Ntoday News
కడప జిల్లాలో 60 మంది ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది.
ఎంపికైన వారిలో 10 మంది ప్రధానోపాధ్యాయులు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 30 మంది సెకండ్ గ్రేడ్ టీచర్లు (SGTలు) ఉన్నారు. విద్యారంగంలో వారు అందించిన సేవలు, బోధనలో ప్రతిభ ఆధారంగా వీరిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసినట్లు విద్యాశాఖ తెలిపింది.
అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు ఈరోజు కడప కలెక్టర్ సభా భవనంలో నిర్వహించనున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ సూచించారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సహచర ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు.