BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 05 September 2026, 10:47 am
Posted by : BHUKYA DEVENDAR

బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
BHUKYA DEVENDAR Nallabelly Mandal
05 Sep, 2026 - 10:47 AM
36 వీక్షణలు

బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది వేడుకలు

వందేళ్ల జీవిత ప్రస్థానానికి ఘన సత్కారం.. తరలివచ్చిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

బుచ్చిరెడ్డిపల్లి | Ntoday News

వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందేళ్ల జీవిత ప్రస్థానాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు.

కేస్లీ మనవళ్లు, మనవరాళ్లు దగ్గరుండి శతాబ్ది వేడుకలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. వందేళ్ల వయస్సులోనూ ఆరోగ్యంగా, చిరునవ్వుతో ఉన్న కేస్లీ ఆశీస్సులు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో బుచ్చిరెడ్డిపల్లికి తరలివచ్చారు.

గ్రామీణ వాతావరణంలో సాంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన పందిరి వద్ద పలు తరాల కుటుంబ సభ్యులు ఒకే చోట కలుసుకోవడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులంతా కలిసి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు.

ఈ సందర్భంగా శతాధిక వృద్ధురాలు లూనావత్ కేస్లీని మనవళ్లు, మనవరాళ్లు ఘనంగా సత్కరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందేళ్ల కుటుంబ బంధాలు, అనుబంధాలకు గుర్తుగా కుటుంబ సభ్యులంతా కలిసి దిగిన ఉమ్మడి ఛాయాచిత్రాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కేస్లీ కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ మనవళ్లు, మనవరాళ్లు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, బంధువులు అభినందించారు. వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకున్న కేస్లీకి మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.