జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్
జాతీయం
జాతీయం
ఆపరేషన్ అష్దార్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది యాసిర్ హతం
జమ్మూకశ్మీర్ | Ntoday News
జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అష్దార్ (Op Ashdar)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లష్కరే తొయిబాకు చెందిన పాకిస్థానీ ఉగ్రవాది యాసిర్‌ను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్లు సమాచారం.
ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, పౌరులను లక్ష్యంగా చేసుకుని గతంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో యాసిర్ కీలకంగా వ్యవహరించినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పూంచ్, బారాముల్లా ప్రాంతాల్లో జరిగిన దాడులతోనూ అతడికి సంబంధం ఉన్నట్లు సమాచారం.
ఎన్‌కౌంటర్ అనంతరం అడవుల్లోకి పరారైన ఇతర ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. అనుమానాస్పద ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.