జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
గతంలో యూనియన్ నుంచి నగర పంచాయతీగా.. ఆ తర్వాత మున్సిపాలిటీగా మారిన జమ్మలమడుగు
జమ్మలమడుగు | Ntoday News
జమ్మలమడుగు పట్టణానికి సుదీర్ఘమైన పరిపాలనా చరిత్ర ఉంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 1885లో జమ్మలమడుగు పట్టణం యూనియన్‌గా కొనసాగింది. అనంతరం 2005లో నగర పంచాయతీగా మారింది. 2008లో మున్సిపాలిటీగా రూపుదిద్దుకుంది.
నగర పంచాయతీగా ఉన్న సమయంలో 2005లో ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాగ సుధా చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2014లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన తాత్రెడ్డి తులసి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు.
2021లో జరిగిన పరిణామాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన వేల్పుల శివమ్మ జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
ఈసారి మున్సిపల్ పీఠంపై ఆసక్తి
గతంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని చేపట్టగా, ఈసారి జమ్మలమడుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు కూటమి, వైఎస్సార్‌సీపీ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మున్సిపాలిటీ భవిష్యత్ పాలకవర్గం ఎవరిదనే అంశం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.