BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 05:11 pm
Posted by : ఈడూరి డేవిడ్

అభివృద్ధి, సంక్షేమంలో గోపాలపురం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
05 Sep, 2026 - 05:11 PM
18 వీక్షణలు

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసిన పార్టీ శ్రేణులకు సన్మానం

దేవరపల్లి | Ntoday News

గోపాలపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం.. ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని దేవరపల్లి మండలం రామన్నపాలెం గ్రామంలో 100 శాతం పూర్తి చేసిన బూత్ ఇన్‌చార్జ్‌లు, గ్రామశాఖ అధ్యక్షులను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శాలువా, ప్రసాదంతో పార్టీ శ్రేణులను సత్కరించారు. ప్రజలతో మమేకమై, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తల కృషిని ఎమ్మెల్యే అభినందించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా అభినందించారు.