వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరం
ఉర్సుగుట్ట, బంధం చెరువు నిమజ్జన పాయింట్లను పరిశీలించిన అధికారులు
వరంగల్ | Ntoday News
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని ఉర్సుగుట్ట చెరువు, బంధం చెరువు నిమజ్జన పాయింట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన, అంతర్గత రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు గుంతలను పూడ్చడం, రహదారులను చదును చేయడం వంటి పనులను పూర్తి చేయాలని సూచించారు.
అలాగే నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు, గుర్రపుడెక్క తొలగింపు, పూడికతీత, పారిశుధ్య నిర్వహణ తదితర పనులను చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ఇతర మౌలిక వసతులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ నెల 14వ తేదీలోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.