BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 04:14 pm
Posted by : JULI SRINIVASULU

ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!!

ఆంధ్రప్రదేశ్
/ శ్రీకాకుళం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
05 Sep, 2026 - 04:14 PM
7 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!!

ఆంధ్రప్రదేశ్‌లోని  శ్రీకాకుళానికి సుమారు 55 కి.మీ. దూరంలో ఉంది ఈ అద్భుత  "కూర్మ" గ్రామం. ఇందులో అడుగు పెడితే 200 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుంది.

ఇక్కడ కరెంటు లేదు, మొబైల్ టవర్లు లేవు, టీవీ లేదు, వాషింగ్ మెషీన్లు లేవు. మొత్తం గ్రామానికి ఒకే ఒక్క ల్యాండ్‌లైన్ ఫోన్ ఉంది!!

ఇస్కాన్ వ్యవస్థాపకులు స్వామి ప్రభుపాదుల వారి శిష్యులు 2018లో దీనిని స్థాపించారు. వేద జీవన విధానాన్ని తిరిగి బ్రతికించడమే వీరి లక్ష్యం. దగ్గరలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ శ్రీకూర్మం ఆలయం నుండే ఈ పేరు వచ్చింది. ప్రపంచంలో విష్ణుమూర్తిని తాబేలు (కూర్మ) అవతారంలో పూజించే ఏకైక ఆలయం అదే.

ప్రస్తుతం 17 కుటుంబాలకు చెందిన 85 మంది ఇక్కడ నివసిస్తున్నారు. వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, రైతులు ఉన్నారు. ఒడిశా నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. నగర హడావిడి జీవితాన్ని వదిలేసి ఈ ప్రశాంత మార్గాన్ని ఎంచుకున్నారు.

ఇళ్ళు సిమెంట్, ఇనుముతో కాకుండా మట్టి, సున్నం, బెల్లం, కందిపప్పు మిశ్రమంతో కడతారు. వీటిని "పెంకుటిళ్ళు" అంటారు. నేలను ప్రతి వారం ఆవు పేడ, మట్టి కలిపి అలుకుతారు!!

తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్రలేవడం, 4:30 గంటలకు భగవద్గీత పారాయణం, తర్వాత గోసేవ, వ్యవసాయం, చేనేత నేత. రాత్రి 8:30 గంటలకే అందరూ నిద్రపోతారు.

మట్టి పొయ్యిల మీదనే వంట. బట్టలు ఉతకడానికి సబ్బుకు బదులుగా బూడిద, కుంకుడుకాయలు వాడతారు... రోజుకు మూడు సార్లు మాత్రమే భోజనం చేస్తారు, సూర్యాస్తమయం తర్వాత పాలు తప్ప ఏమీ తీసుకోరు!!

పిల్లలు: గురుకులంలో సంస్కృతం, వేదాలు, వేద గణితం చదువుతారు - మొబైల్ గేమ్స్ ఆడటం పూర్తిగా నిషేధం!

60 ఎకరాల విస్తీర్ణంలో వారే స్వయంగా 198 బస్తాల ధాన్యం, రకరకాల కూరగాయలు పండిస్తారు. బయట మార్కెట్ నుండి ఏమీ కొనాల్సిన అవసరమే లేదు!

కరెంటు, ఇంటర్నెట్, మొబైల్, టీవీ, ఆధునక సౌకర్యాలు లేకుండా కూడా మనిషి ఎంత ప్రశాంతంగా, మంచి జీవితం గడపవచ్చో చూడటానికి ప్రతీ వారాంతంలో 400 మందికి పైగా ఇక్కడికి వస్తున్నారు.

ఈ గ్రామం మనకు నేర్పేది ఒక్కటే - మనశ్శాంతి భౌతిక సౌకర్యాలలో లేదు, సరళమైన జీవనంలోనే ఉందని.