BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 05:17 pm
Posted by : DAVU RAVINDER REDDY

విద్యార్థుల ప్రవర్తనపై టీచర్లు దృష్టి పెట్టాలి: మోదీ

జాతీయం
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
05 Sep, 2026 - 05:17 PM
6 వీక్షణలు

డ్రగ్స్‌ వ్యసనానికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలి.. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

న్యూఢిల్లీ | Ntoday News

యువతలో పెరుగుతున్న డ్రగ్స్‌ వ్యసనంపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న 82 మంది ఉపాధ్యాయులు ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు నిశితంగా గమనించాలని మోదీ సూచించారు.

విద్యార్థులను క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిని చెడు అలవాట్లకు దూరంగా ఉంచడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

పిల్లల్లో పెరుగుతున్న అధిక స్క్రీన్‌ టైమ్‌ ఆందోళన కలిగించే అంశంగా మారుతోందని మోదీ అన్నారు. తల్లిదండ్రులతో కలిసి పనిచేస్తూ విద్యార్థుల మొబైల్‌ వినియోగాన్ని తగ్గించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు.

విద్యార్థుల చదువుతో పాటు వారి మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రవర్తనపై కూడా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ప్రధాని సూచించారు.