హనంకొండ :సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ..
123 మంది లబ్ధిదారులకు రూ.32.40 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని..
హనుమకొండ: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 123 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.32,40,000/- విలువైన సీఎం సహాయనిధి చెక్కులను బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.