పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
వ్యాయామ ఉపాధ్యాయుడు పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
నరసరావుపేట (పల్నాడు):నరసరావుపేటలో ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో శంకరభారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు (PET) పొట్టసిరి తిరుపతిరావు పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు చేతులు మీదుగా ఆయన వ్యాయామ ఉపాధ్యాయుడు పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఈ పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని స్వీకరించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయిని (HM) ఎం. పార్వతి తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు తిరుపతిరావును అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.