ఘనంగా మువ్వా విజయబాబు జన్మదిన వేడుకలు
కేక్ కటింగ్‌తో సంబరాలు.. 100 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ
సత్తుపల్లి | Ntoday News
TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు జన్మదినోత్సవ వేడుకలను సత్తుపల్లి నియోజకవర్గంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్ రింగ్ సెంటర్‌లో అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు.
తదుపరి సత్తుపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన అభిమానులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
1వ వార్డులోనూ వేడుకలు
సత్తుపల్లి 1వ వార్డులో కౌన్సిలర్ మట్టా ప్రసాద్ ఆధ్వర్యంలో మువ్వా విజయబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి, బేతుపల్లి గ్రామాల్లో కూడా మువ్వా విజయబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నియోజకవర్గవ్యాప్తంగా తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన అభిమానులు, ప్రజలకు మువ్వా విజయబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిమానం, ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, MRPS నాయకులు, మువ్వా విజయబాబు, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.