సత్తుపల్లి పట్టణంలో రామాలయంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ
/
ఖమ్మం
మువ్వా విజయబాబు జన్మదినం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు
ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అభిమానుల ఆకాంక్ష
సత్తుపల్లి | Ntoday News
TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు జన్మదినోత్సవం సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని పాత సెంటర్ రామాలయంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మువ్వా విజయబాబు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా విజయబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.