ఉత్తమ ఉపాధ్యాయులకు ఆచార్య దేవో భవ అవార్డులు
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాల | Ntoday News
మంచిర్యాల నియోజకవర్గంలోని గద్దెరగాడి V స్క్వేర్ ఫంక్షన్ హాల్‌లో ప్రైవేట్ పాఠశాలల ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆచార్య దేవో భవ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, నైతికతను అందించే గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారి ప్రతిభను ప్రోత్సహించేలా ‘ఆచార్య దేవో భవ’ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.
అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు రాపోల్ విష్ణువర్ధన్‌రావు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదారి చంద్రమోహన్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు దుర్గ ప్రసాద్, సీనియర్ కరస్పాండెంట్ బాలాజీ, శరత్‌కుమార్, శ్రీధర్, స్థానిక కార్పొరేటర్ గంగవరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.