గుడివాడలో ఘనంగా శ్రీ గంగనమ్మ జాతర జాతరలో ఉత్సాహంగా పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని
అమ్మవారికి ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు
గుడివాడ: పట్టణంలోని పెద్దఎరుకపాడు ఒడ్రుబజార్‌లో శ్రీ గంగనమ్మ జాతర మహోత్సవం అట్టహాసంగా జరిగింది. జాతర వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నాని ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన జాతరలో కొడాలి నాని స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజల సుభిక్షం, రైతులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీ గంగనమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం జాతర కమిటీ సభ్యులు కొడాలి నానికి తీర్థప్రసాదాలు అందజేశారు. జాతర మహోత్సవం సందర్భంగా ఒడ్రుబజార్ ప్రాంతమంతా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను, అడప పండు, బత్తుల దుర్గారావు, బత్తుల నాగరాజు, ఓర్సు రాములు, బత్తుల వెంకన్న, బత్తుల బాలాజీ, బత్తుల తిరుపతిరావు, బత్తుల వేంకటేశ్వరరావుతో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.