BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 September 2026, 11:12 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు రూరల్‌ బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Sep, 2026 - 11:12 PM
1 వీక్షణలు

సంకల్ప అభియాన్‌ను విజయవంతం చేయాలి.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

పుంగనూరు | Ntoday News

అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు పులి నరేంద్రకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు రూరల్‌ మండల బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని మండల అధ్యక్షుడు కే. శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఆధ్వర్యంలో తొలి కార్యవర్గ సమావేశాన్ని ఆరడుగుంట పంచాయతీ కురపల్లి గ్రామంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మండలంలోని పార్టీ కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మండల కమిటీల పదవీకాలం పూర్తయి ఖాళీగా ఉన్న అధ్యక్ష, కార్యదర్శి పదవులను భర్తీ చేయడంపై కూడా సమావేశంలో చర్చించారు.

సంకల్ప అభియాన్‌పై దిశానిర్దేశం

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17, 2026 వరకు ‘సంకల్ప అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో పుంగనూరు రూరల్‌ మండలంలోని అన్ని పంచాయతీల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని సూచించారు. కూటమి ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు సాగుతూ బీజేపీకి కేటాయించే సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు సీనియర్‌ నాయకులు, యువత, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మండల అధ్యక్షుడు కే. శ్రీనివాసులురెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో ఆరడుగుంట పంచాయతీ బీజేపీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, కే. చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ రూరల్‌ అధ్యక్షుడు నారాయణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విజయ్‌ భాస్కర్‌రెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకులు ఏ. చిన్నకృష్ణప్ప, కే. కిరణ్‌కుమార్, రూరల్‌ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నాగరాజు, కార్యకర్తలు మంగళం వేణు, గంగాధర, ఆంజనేయులు, రెడ్డి ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.