BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 September 2026, 11:33 pm
Posted by : కూనురు మధు

మతసామరస్యాన్ని చాటుకున్న షబానా అజీమ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Sep, 2026 - 11:33 PM
2 వీక్షణలు


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఊర బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ షబానా అజీమ్ మాట్లాడుతూ  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ నిలువుటద్దంగా నిలుస్తుందని అన్నారు.


ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే బోనాల పండుగకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉందని, సంప్రదాయంగా ఉపయోగించే కొన్ని పదార్థాలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలు ప్రజల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, భక్తులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.