BREAKING
గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు
Date of Publish : 07 September 2026, 06:31 pm
Posted by : NTODAY NEWS

గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి

జాతీయం జాతీయం
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
07 Sep, 2026 - 06:31 PM
17 వీక్షణలు

గిరిజన ఆదివాసీ హక్కులను కాపాడాలి

గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి

జంతర్ మంతర్ న్యూ ఢిల్లీ /ఎన్ టుడే న్యూస్.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల వివక్షత చూపుతూ, అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకుండా ఆదివాసీ గిరిజనులను వారి భూముల నుంచి వెళ్లగొట్టే కుట్రలను వెనక్కి తీసుకోవాలని గిరిజనుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ గిరిజన సంఘం (TGS) ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ (AARM) ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు యం గోపి నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటి పరిష్కారంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు అన్నారు అదే రకంగా దేశవ్యాప్తంగా ఆదివాసి గిరిజనులు తమ సమస్యలకు పరిష్కారం కోసం ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించి తమ సమస్యల పరిస్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు అదే విదంగా 

అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించాలని, గిరిజనులను వారి సాగుభూముల నుంచి తొలగించే చర్యలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనుల భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు పోడు సాగుదారులకు హక్కు పత్రాలు అందించాలని కోరారు. అదే విదంగా దేశంలో గిరిజన నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థల్లో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. గిరిజన యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, భూమి తదితర మౌలిక సమస్యలను పరిష్కరించడంతో పాటు గిరిజనుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు 

ఈ మహాధర్నాలో గిరిజనుల భూ సమస్యలు, అటవీ హక్కుల చట్టం అమలు, నిరుద్యోగం, విద్య, వైద్యం ఇండ్లు లేని నీరు పెద్ద గిరిజనుల ఇండ్లు ఇండ్ల స్థలాలు కు మూడు లక్షల నుండి ఆరు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు కేట్ట ఇస్తామని వాగ్దానం చేసిన కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు మోసం చేసింది అన్ని కేంద్ర ప్రభుత్వం పై గోపినాయక్ మండి పెట్టారు తదితర సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ తమ హక్కుల కోసం నిరంతరం పోరాటం నిర్వహిస్తామని వారు అన్నారు అదే రకంగా ఈ మహా ధర్నా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి గిరిజన ఆదివాసులు పాల్గొన్నారు అన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నాయకులు ఈశ్వర్ నాయక్ .నేనావాత్ పార్వతి. శంకర్ నాయక్. తదితరులు పాల్గొన్నారు....