బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
సమగ్ర విచారణ చేపట్టాలని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతి
హైదరాబాద్ | Ntoday News
అసెంబ్లీ బయట ఎమ్మెల్యేల పట్ల జరిగినట్లు పేర్కొంటున్న అవమానకర ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు.
బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, విజయుడు, మాణిక్‌రావు, అనిల్ జాదవ్.. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు.
అసెంబ్లీ బయట ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు.