కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై పిలుపు
కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై పిలుపు: పెగడపల్లి మండలంలో BRS ‘బాకీ కార్డ్’ నిరసన ర్యాలీ
పెగడపల్లి:Ntoday news
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల మోసపూరిత పాలనపై పెగడపల్లి మండలంలో బిఆర్‌ఎస్ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, 'బాకీ కార్డ్' ప్రదర్శిస్తూ ప్రజావాణిలో మండల MPDO గారికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయంగా వినతిపత్రం అందజేశారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు:
పెన్షన్ల ఎగవేత: ₹2,000 ఉన్న పెన్షన్‌ను ₹4,000 చేస్తామని మాటిచ్చి సంవత్సరాలు దాటుతున్నా అమలు చేయలేదని, దీనికి నిరసనగా ఇప్పటికే ధర్మారం మండలంలో వంటా-వార్పు చేపట్టినట్లు గుర్తుచేశారు.
యువతకు మోసం: ఏటా 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు, ఆర్థిక సాయం, విదేశీ విద్య వంటి హామీలు నెరవేర్చకపోవడంతోనే ధర్మపురిలో భారీ యూత్ ర్యాలీ నిర్వహించామన్నారు.
ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ బాకీలు:
ఫించన్ దారులు: రూ. 66,000 (33 నెలలకు)
రైతులు: రూ. 1,02,000
దివ్యాంగులు: రూ. 66,000
వ్యవసాయ రంగానికి గండి: గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్, నీటిపన్ను రద్దు, రైతుబంధు వంటి పథకాలతో రైతులను ఆదుకుంటే, నేడు కాంగ్రెస్ సర్కార్ ఎరువుల సరఫరా సరిగా లేక, రకరకాల యాప్‌ల పేరుతో రైతాంగాన్ని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు.
మండలంలో ఆగిపోయిన అభివృద్ధి: గతంలో BRS హయాంలో పెగడపల్లి మండలంలో మోడల్ స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్ యార్డులు, గ్రామ పంచాయతీ భవనాలు మరియు డబుల్ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామని, ప్రస్తుత ప్రభుత్వంలో నిధుల కొరత వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. SC బాలుర హాస్టల్ కొరకు మంజూరైన ₹2.5 కోట్ల నిధులను స్థానిక ప్రజాప్రతినిధులు సరిగా వినియోగించలేకపోతున్నారని ఆరోపించారు.
మహిళలకు ₹2,500 ఆర్థిక సాయం, తులం బంగారం, రైతు భరోసా, రైతు బీమా వంటి హామీలను తుంగలో తొక్కి, ప్రజా సమస్యలను వదిలేసి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక నాయకుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలంతా ఐక్యంగా నిలదీయాలని పిలుపునిచ్చారు.