కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి
ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలి–ఎల్.బి.నగర్.నియోజకవర్గ భారస నాయకులు
సరూర్నగర్ ఎమ్మార్వో కు వినతి పత్రం
ఎల్బీనగర్/ ఎన్ టుడే న్యూస్.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు,6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని భారస నాయకులు డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, నేటికీ అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేసి ప్రజలకు రావాల్సిన ప్రయోజనాలను అందించాలని కోరుతూ సరూర్ నగర్ ఎం.ఆర్.ఓ.కి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం తదితర హామీలను అమలు చేయాలి.
రైతులకు రైతు భరోసా, ప్రతి పంటకు బోనస్, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ వంటి హామీలను నెరవేర్చాలి.
రైతు కూలీల సంక్షేమానికి రూ.12,000 సహాయం అందించాలి.
ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి.
విద్యార్థులకు విద్యా భరోసా, పెండింగ్ ఫీజు బకాయిల చెల్లింపుతో పాటు విద్యార్థుల సంక్షేమ హామీలను అమలు చేయాలి.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు పెంచిన పెన్షన్లు అందించాలి.
ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించాలి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యార్థులు, యువజనులు, రైతులు తదితర వర్గాలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. గ్రామాలు, పట్టణాల్లో పెండింగ్‌లో ఉన్న పారిశుద్ధ్య, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలి.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్ని ఎన్నికల హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి,జిట్ట రాజశేఖర్ రెడ్డి,భవాని ప్రవీణ్ కుమార్,పద్మానాయక్,సాగర్ రెడ్డి,జిన్నారం విఠల్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు చిరంజీవి,వరప్రసాద్ రెడ్డి,సత్యంచారి,శ్రీశైలం యాదవ్,రాజిరెడ్డి,తోట మహేష్ యాదవ్,జక్కిడి మల్లారెడ్డి మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.