లంకసాగర్ లో రైస్ ఇండస్ట్రీని ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్
సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లంకసాగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విజయాగణపతి రైస్ ఇండస్ట్రీ ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. తుమ్మల యుగంధర్ ప్రారంభించారు. రైస్ ఇండస్ట్రీస్ లో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమం లో పాల్గొని రైస్ ఇండస్ట్రీ యాజమాన్యం నికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు కూడ ప్రయోజనం చేకూరుతుంది అని పేర్కొన్నారు. అంతే కాకుండా తుమ్మల నాగేశ్వరావు గారు (నాన్నగారు )తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లోను, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కీ శక్తి వంచన లేకుండా నిరంతరం శ్రామిస్తునరాని రైతు శ్రేయసే తమ అభిమాతమని అన్నారు
ఈ కార్యక్రమం లో కల్లూరు AMC వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, లంకసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు