BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 07 September 2026, 05:06 pm
Posted by : ఈడూరి డేవిడ్

టాప్‌–5 నియోజకవర్గాల్లో గోపాలపురం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
07 Sep, 2026 - 05:06 PM
6 వీక్షణలు

టీడీపీ కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

గోపాలపురం | Ntoday News

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్‌–5 నియోజకవర్గాల్లో గోపాలపురం నియోజకవర్గం నిలిచింది.

సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ లీడర్స్‌ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు కృషిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అనుసరించిన విధానం, ఆలోచనలు, ప్రణాళికలు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసిన తీరును ఇతర నాయకులకు వివరించాలని ఎమ్మెల్యేను కోరారు.

సీఎం సూచన మేరకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణకు అనుసరించిన ప్రణాళికలు, కార్యకర్తల భాగస్వామ్యం, కార్యక్రమాల అమలు తీరును కాంక్లేవ్‌లో పాల్గొన్న నాయకులకు వివరించారు.

రాష్ట్రస్థాయిలో టాప్‌–5లో గోపాలపురం నియోజకవర్గం నిలవడం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.