ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హత ఉన్నా ప్రతి ఒక్కరు దరఖాస్తులు చేసుకోవాలి
టీడీపీ ప్రధాన కార్యదర్శి మండల రమా శంకర్ రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, బి.జె.పురం గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
వృద్ధాప్య దారులు,వితంతు మహిళలు, ఒంటరి మహిళలు,దివ్యాంగులు మరియు ఇతర సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన వారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అర్హులైన వారు మీ దరఖాస్తులను మన బి.జె.పురం గ్రామ సచివాలయంలో సమర్పించుకోవాలి.అర్హత ఉన్న వారు ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు.
మీ కుటుంబంలో, బంధువుల్లో లేదా పరిచయాల్లో అర్హత ఉన్నవారు ఉంటే ఈ సమాచారాన్ని వారికి కూడా చేరవేయండి.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ అందేలా మా వంతు సహకారం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటుంది.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి సంఘం నాయుడు, జనసేన పార్టీ నాయకులు మెండి రమేష్, జనసేన పార్టీ నాయకులు గుణుపూరు ప్రవీణ్ కుమార్ మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.