BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం
Date of Publish : 07 September 2026, 05:35 am
Posted by : PARSIKA KAMESH

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ పోలవరం
07 Sep, 2026 - 05:35 AM
1 వీక్షణలు

చింతూరు మండల బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బట్ట సుప్రీజ పిలుపు

చింతూరు | Ntoday News

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చింతూరు మండలంలో బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బట్ట సుప్రీజ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు చింతూరు మండల బీజేపీ అధ్యక్షుడు బట్ట లక్ష్మణ్‌రాజు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బట్ట సుప్రీజ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రతి గ్రామంలో విస్తృతంగా పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాలతో అనుసంధానం చేయాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు అర్హత, ప్రజాదరణ ఉన్న నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారి వివరాలతో ముందుగానే జాబితాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ సిద్ధంగా ఉండేలా గ్రామస్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవాలని మండల అధ్యక్షుడు బట్ట లక్ష్మణ్‌రాజు అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే బీజేపీ కార్యకర్తల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు.

అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందేలా కృషి

మండలంలోని అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కొత్త పింఛన్ల కోసం స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేలా బీజేపీ కార్యకర్తలు సహకరించాలని లక్ష్మణ్‌రాజు సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా కృషి చేయాలని కోరారు. అక్టోబర్‌లో కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉన్నందున అర్హులను ముందుగానే గుర్తించి దరఖాస్తు ప్రక్రియలో సహకరించాలని కార్యకర్తలకు సూచించారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ సిద్ధాంతాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బట్ట సుప్రీజ, శీర్షిక కామరాజు, మోర్చా అధ్యక్షులు, సీనియర్ నాయకులు కుప్ప సామి, స్మఖం రవ్వ, ఆదెమ్మ, శిలం సీతమ్మ, తునికి వీరాస్వామి, మండల కార్యదర్శి శీర్షిక రంజిత్, ఎస్టీ యువ మోర్చా నాయకులు నాగుల, కొండబాబు, శీర్షిక సుమన్, బాలకృష్ణ, ఓబీసీ ప్రధాన కార్యదర్శి కొముజీ ఈశ్వర్, ఎస్టీ ప్రధాన కార్యదర్శి కొసలు సతిబాబు తదితరులు పాల్గొన్నారు.