BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 07 September 2026, 07:05 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

వెంకట్రావుపేట్ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
07 Sep, 2026 - 07:05 PM
6 వీక్షణలు

వెంకట్రావుపేట్ ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం

లక్షెట్టిపేట్ మండలం: వెంకట్రావుపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, చదువుపై మరింత ఆసక్తి పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్‌టీఏ సభ్యులు అంకతి శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు. అలాగే గ్రామ సర్పంచ్ నలిమేల రాజు, గ్రామ ఉపసర్పంచ్ కోన తిరుమల, గ్రామ కార్యదర్శి సింగతి వంశీకృష్ణ, గ్రామ కార్యబారితో పాటు పలువురు గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారం అందించి, కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.