హనుమకొండ కలెక్టరేట్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
టీజీపీసీబీ ఆధ్వర్యంలో కార్యక్రమం.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్
హనుమకొండ | Ntoday News
హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా వినాయక చవితి వేడుకలను నిర్వహించవచ్చని అధికారులు సూచించారు.
ఈ సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు.