గుత్త అమిత్ రెడ్డికి ఘన అభినందనలు
తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తి
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా గుత్త అమిత్ రెడ్డి రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు జన్నపాల రాము గుత్త అమిత్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రైతులు, పాడి రైతుల సంక్షేమంతో పాటు విజయ డెయిరీ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
విజయ డెయిరీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఆయన నాయకత్వం కొనసాగాలని, సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. విజయ డెయిరీ ఉద్యోగులు, సిబ్బంది ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొని గుత్త అమిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
గుత్త అమిత్ రెడ్డి నాయకత్వంలో విజయ డెయిరీ మరింత అభివృద్ధి సాధించాలని జన్నపాల రాము ఆకాంక్షించారు.