శంషాబాద్ : ప్రముఖ యూట్యూబర్ నందన అదుపులోకి
తెలంగాణ
/
హైదరాబాద్
లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నందనపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విమానాశ్రయ పోలీసులు నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
లండన్‌లో ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.