BREAKING
విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ
Date of Publish : 07 September 2026, 06:47 pm
Posted by : SEETHA KIRAN KUMAR

NEET UG 2026: రెండో రౌండ్‌లో కొత్త MBBS సీట్లు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
07 Sep, 2026 - 06:47 PM
5 వీక్షణలు

దేశవ్యాప్తంగా MBBS సీట్లు 1,36,939కు పెంపు.. తెలంగాణలో 10,250 సీట్లు

న్యూఢిల్లీ | Ntoday News

NEET UG 2026 కౌన్సెలింగ్‌లో రెండో రౌండ్‌కు కొత్తగా పెంచిన MBBS సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రెండో రౌండ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులో రిజిస్ట్రేషన్‌తో పాటు చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

2026–27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా MBBS సీట్ల సంఖ్యను 1,36,939కు పెంచినట్లు NMC పేర్కొంది. కొత్తగా మంజూరైన సీట్లు రెండో రౌండ్ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు అందుబాటులోకి రానున్నాయి.

రాష్ట్రాల వారీగా సీట్ల వివరాలు

దేశంలో అత్యధిక MBBS సీట్లు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక 15,395, ఉత్తరప్రదేశ్ 14,000, తమిళనాడు 13,999, మహారాష్ట్ర 13,099 సీట్లతో ముందంజలో ఉన్నాయి.

తెలంగాణలో మొత్తం 10,250 MBBS సీట్లు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని మూడు మెడికల్ కాలేజీల్లో అదనంగా 30 కొత్త MBBS సీట్లు చేరినట్లు తెలుస్తోంది.

కొత్తగా అందుబాటులోకి వచ్చే సీట్లతో రెండో రౌండ్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. అభ్యర్థులు అధికారిక కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను పరిశీలించి నిర్ణీత తేదీల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు.