నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్
కాకర్లపల్లిలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు
సత్తుపల్లి | Ntoday News
సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన నూనె కృష్ణంరాజు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ హాజరై నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారుడికి గృహ నిర్మాణ బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కాకర్లపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.