BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 08 September 2026, 10:20 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
08 Sep, 2026 - 10:20 PM
6 వీక్షణలు

తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కల్లూరు పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

కల్లూరు | Ntoday News

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కల్లూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తాతా మధుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సభ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పరువు నష్టానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తాతా మధు ప్రవర్తనపై శాసన మండలి చైర్మన్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, ఎమ్మెల్సీ తాతా మధును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు పట్టణం, మండల పరిధికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.