BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 08 September 2026, 10:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు: వృద్ధ గిరిజన మహిళను దూషించిన సీఐపై చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 10:15 PM
6 వీక్షణలు

గుంటూరు: 70 ఏళ్ల గిరిజన మహిళను అసభ్య పదజాలంతో దూషించిన చీరాల టు టౌన్ సీఐ శశికుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపకులు వధిత్యా శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.

వృద్ధ మహిళ పట్ల సీఐ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం గుంటూరులో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లాలోని ఆదినారాయణపురంలో ఈ నెల 6న నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో భాగంగా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మట్రా జాలమ్మను సీఐ దూషించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

వృద్ధ మహిళతో సీఐ మాట్లాడిన మాటలు తమ ఆత్మను ఘోషించేలా చేశాయని, మనసును కలిచివేశాయని శంకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, హోం శాఖ వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ వ్యవస్థ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉందని అన్నారు. మట్రా జాలమ్మ ఘటనపై తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

గిరిజనుల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని శంకర్ నాయక్ హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.