BREAKING
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్
Date of Publish : 08 September 2026, 08:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రిలయన్స్ కోసం రైతుల జీవితాలను బొగ్గుపాలు చేస్తారా?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 08:36 PM
26 వీక్షణలు

డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు 

యూసీజీ బొగ్గు వెలికితీతపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి

బొగ్గు గని కోసం మా భూములు ఇచ్చేది లేదు

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశం తీర్మానం

చింతలపూడి, సెప్టెంబర్ 8: రిలయన్స్ లాభాల కోసం రైతులు, ప్రజల జీవితాలను బొగ్గుపాలు చేస్తారా? అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ ప్రశ్నించారు.

రాఘవాపురం శివారు అంకులయ్య కొత్తగూడెంలో మంగళవారం బొగ్గు గని ప్రాంత రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘‘రిలయన్స్‌కు మా భూములు ఇవ్వం.. మా భూమి మా హక్కు’’ అంటూ రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

సమావేశంలో కె. శ్రీనివాస్ మాట్లాడుతూ.. రిలయన్స్ బొగ్గు ఆధారిత వాయు ఉత్పత్తి కోసం ఈ ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. రైతులతో చర్చించకుండా, వారి ఆమోదం లేకుండా భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులను ప్రజలకు పూర్తిగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపాదిత బొగ్గు వాయు ఉత్పత్తి ప్రాజెక్టు ద్వారా కేవలం 5 వేల మందికి మాత్రమే ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వమే ప్రకటించిందని పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో ఆయిల్‌పామ్, కొబ్బరి, కోకో, మొక్కజొన్న, వరి తదితర ఉద్యాన, వాణిజ్య, ఆహార పంటల ద్వారా వేలాది కుటుంబాలకు నిరంతరం ఉపాధి లభిస్తోందన్నారు. భూసేకరణ జరిగితే ప్రస్తుత వ్యవసాయ ఆధారిత జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

బొగ్గు ఆధారిత వాయు ఉత్పత్తి వల్ల ఏర్పడే పర్యావరణ ముప్పు, భూగర్భ జలాలపై ప్రభావం, వ్యవసాయంపై పడే దుష్ప్రభావాలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఇప్పటికైనా ప్రతిపాదిత బొగ్గు గని ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ చేపడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పి. పాండురంగారావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఆర్.వి.ఎస్. నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు సత్యనారాయణ, రైతులు చీకటి శ్రీనివాసరావు, శెట్టిపల్లి ప్రసాద్, మామిళ్లపల్లి అప్పారావు, బాలా నరసింహారావు, చీకటి వెంకట సత్యనారాయణ, చీకటి రజని, మట్టా దమయంతి, మోరంపూడి శ్రీనివాసరావు, చీకటి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.