BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 07 September 2026, 09:14 pm
Posted by : P. KISHORE

మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
07 Sep, 2026 - 09:14 PM
7 వీక్షణలు

మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం 

చిత్తూరు పట్టణములోని PVKN డిగ్రీ కాలేజీ నందు విద్యార్ధులకు వివిధ భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ చిన్న పెద్దయ్య గారు మరియు సైబర్ సెల్ – సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ శ్రీ నిత్యబాబు గారు కలిసి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సమయంలో ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేదా గురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

అలాగే మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల నివారణ, వేధింపులు, బాలల భద్రత, గృహ హింస తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, OTPలు, PINలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు.

అదేవిధంగా మాదకద్రవ్యాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ పరిసరాల్లో ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 9490617896 కు లేదా ఈగల్ నెంబర్ 1972 కు లేదా సమీప పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో డయల్-112, మహిళల సహాయం కోసం 181, బాలల సహాయం కోసం 1098, సైబర్ నేరాల కోసం 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.

మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పోలీసులకు సమాచారం అందించడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్ధులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.