విద్యాభివృద్ధికి సరికొత్త బాట...
విద్యాభివృద్ధికి సరికొత్త బాట.. డొంకేశ్వర్‌కు పబ్లిక్ స్కూల్ మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కి కృతజ్ఞతలు..
డొంకేశ్వర్: డొంకేశ్వర్ మండల కేంద్రానికి "తెలంగాణ పబ్లిక్ స్కూల్" మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాల మంజూరయ్యేలా ప్రత్యేక కృషి చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి డొంకేశ్వర్ మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ ప్రాంత విద్యాభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే రాకేష్ అన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోతుగంటి సురేందర్, మండల కోశాధికారి మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు చిన్న, బూత్ అధ్యక్షులు సాయి కుమార్, భామని గంగాధర్, చాకలి నరేష్ మరియు పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.