ఓనుకూరి ప్రభాకర్ రెడ్డి ని పరామర్చించిన డాక్టర్ మట్టా దయానందు
తెలంగాణ
/
ఖమ్మం
సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఓనుకూరి ప్రభాకర్ రెడ్డికి ఇటీవల వెన్నెముకకు శాస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానందు విజయకుమార్ అయన నివాసనికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమం లో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, పేరువంచ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు