ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
భక్తిశ్రద్ధలతో కాటమయ్యకు బోనాలు సమర్పించిన గౌడ కులస్తులు
చిట్యాల | Ntoday News
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏలికట్టే గ్రామంలో కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గౌడ కులస్తులు భక్తిశ్రద్ధలతో కాటమయ్య బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి కాటమయ్యకు నైవేద్యాలు సమర్పించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కంఠమహేశ్వర స్వామిని వేడుకున్నారు.
బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక, భక్తి వాతావరణం నెలకొంది. గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు