BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 08:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కె.కోటపాడు: 5 సెంట్ల భూమికి రూ.20 వేల లంచం!

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 08:57 AM
22 వీక్షణలు

రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. వీఆర్వో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు:

ముఖ్యమంత్రి పదేపదే హెచ్చరిస్తున్నా రెవెన్యూ వ్యవస్థలో అవినీతి తగ్గడం లేదనే ఆరోపణలకు తాజా ఘటన అద్దం పడుతోంది. కేవలం 5 సెంట్ల భూమికి 1బీ జారీ చేసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన ఘటన కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేపింది.

వారాడ గ్రామానికి చెందిన రైతుకు 5 సెంట్ల భూమికి సంబంధించిన 1బీ జారీ చేయడానికి వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.

ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు వివరాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.

రైతుల భూములకు సంబంధించిన చిన్నచిన్న పనులకు సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.