BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 08:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరిలో టీడీపీ లీడర్‌షిప్‌ శిక్షణ కాంక్లేవ్ తిరువూరు, మైలవరం ఎమ్మెల్యేల హాజరు..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 08:57 AM
19 వీక్షణలు

 నాయకత్వం, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం

తిరువూరు, సెప్టెంబర్‌ 8: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన టీడీపీ లీడర్‌షిప్‌ శిక్షణ కాంక్లేవ్‌లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

సమర్థవంతమైన నాయకత్వం, పార్టీ సంస్థాగత బలోపేతం, నాయకులు–కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడం వంటి అంశాలపై కాంక్లేవ్‌లో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాజకీయ కమ్యూనికేషన్‌, సుపరిపాలన, స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధన, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై నాయకులకు మార్గదర్శనం చేశారు.

కాంక్లేవ్‌లో పొందిన మార్గదర్శకాలను నియోజకవర్గాల్లో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువగా ఉండాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

ప్రజా సేవే పరమావధిగా..

పార్టీ బలోపేతమే లక్ష్యంగా..

అభివృద్ధి–సంక్షేమమే ధ్యేయంగా..

తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రగతికి మరింత వేగంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

ప్రజలే లక్ష్యం – అభివృద్ధే ధ్యేయం – టీడీపీ బలోపేతమే సంకల్పం