BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 09:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయనగరం: బొత్స మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరిక వైసీపీకి రాజీనామా...

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 09:48 AM
8 వీక్షణలు

విజయనగరం: బొత్స మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరిక వైసీపీకి రాజీనామా.. చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా

కుమార్తెతో కలిసి టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. చిన్న శ్రీనుతో పాటు ఆయన కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరడానికి ముందు చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ పంపారు. భీమిలి నియోజకవర్గ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

విజయనగరం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కీలకంగా వ్యవహరించిన చిన్న శ్రీను పార్టీ మారడం వైసీపీకి గట్టి రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. ఆయనకు జిల్లాలో ఉన్న రాజకీయ పరిచయాలు, అనుచర బలం టీడీపీకి కలిసొచ్చే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చేరిక చోటుచేసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్న శ్రీను టీడీపీలో చేరికతో విజయనగరం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలపై చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీ నాయకులు టీడీపీ వైపు వచ్చే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.