BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 09:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 09:47 AM
8 వీక్షణలు

హైదరాబాద్ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం మహిళా జర్నలిస్టులపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టును ఖండిస్తూ టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛను హరించేందుకు పాలకులు ప్రయత్నిస్తే ప్రజాస్వామికవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని జర్నలిస్టులు ముక్తకంఠంతో హెచ్చరించారు.

ఢిల్లీలో విధినిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులు షాహిన్ ఖాన్, నఫీజా ఖాన్‌లపై పోలీసులు దాడి చేయడం, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

బషీర్‌బాగ్‌లోని టీయుడబ్ల్యూజే కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ప్రదర్శన నిజాం కళాశాల మీదుగా జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ అధ్యక్షతన సభ నిర్వహించారు.

సభలో సీనియర్ పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులు మాట్లాడుతూ.. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛను హరిస్తూ తమకు అనుకూలమైన విధానాలను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అవలంబించడం అప్రజాస్వామికమని సీనియర్ పాత్రికేయుడు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐదు రోజుల క్రితం ఢిల్లీలో విధినిర్వహణలో ఉన్న మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళా జర్నలిస్టులు షాహిన్ ఖాన్, నఫీజా ఖాన్‌లపై పోలీసులు దాడి చేసి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు, అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులకు న్యాయం చేయడంతో పాటు ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎం.ఏ. మాజీద్, జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, కె. అజిత, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షురాలు అత్తలూరి అరుణ, టీయుడబ్ల్యూజే మహిళా జర్నలిస్ట్స్ విభాగం కన్వీనర్ రాజేశ్వరీ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య, సీనియర్ పాత్రికేయులు వనజ, స్వప్న, విమల, టీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్ కుమార్, హెచ్‌యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి, తెలంగాణ ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గౌస్ మోహియొద్దీన్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.