BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 08:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గణేష్‌ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 08:57 AM
16 వీక్షణలు

తెలంగాణలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం అమల్లో ఉంటుంది.

నివాస ప్రాంతాల్లో శబ్ద తీవ్రత 55 డెసిబుల్స్‌కు మించకూడదని అధికారులు స్పష్టం చేశారు. పగటిపూట కూడా అనుమతించిన పరిమితుల్లోనే శబ్దం ఉండాలని సూచించారు.

అదేవిధంగా పాఠశాలలు, ఆస్పత్రుల చుట్టూ 100 మీటర్ల పరిధిని నిశ్శబ్ద ప్రాంతంగా ప్రకటించారు. ఈ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా శబ్దం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

శబ్ద తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు డెసిబుల్‌ మీటర్లతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గణేష్‌ ఉత్సవాల నిర్వాహకులు నిబంధనలు పాటించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పోలీసులు సూచించారు.