ఆయుష్మాన్ భారత్.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
జాతీయం
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద అర్హులైన పేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందుతుంది. కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సుతో సంబంధం లేకుండా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాధులకు కూడా చికిత్స వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం పొందే అవకాశం ఉంది. అర్హత ఉన్నవారు ఆధార్ ధ్రువీకరణతో ఆరోగ్య కార్డును పొందవచ్చు.